తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు
*భగవంతుని రెండో స్థానం వ్యూహం శ్రీ గోదాదేవ్యై నమః 🌺🌺🌺🌺 పాశురాం వైయత్తు వాళ్ వీర్ గళ్ ! నాముమ్ నమ్బావైక్కు శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్ పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్ ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్. మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు , శాస్త్రాలలో ఆవి కర్మయోగమని , జ్ఞానయోగమని , భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ , కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస...